గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై వెరైటీగా స్పందించారు. రాబోయే రోజుల్లో రైతులే వ్యవసాయ చట్టాలు కావాలని కోరుతారంటూ జోస్యం చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బ్రోకర్లకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్నింటిని ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. రైతుల కష్టాలను బ్రోకర్లు సొమ్ము చేసుకుంటుండటంతో రైతన్నలు నష్టపోతున్నారన్నారు. రైతులు లాభాలను గడించి.. లబ్ధిపొందలన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకువచ్చిందన్నారు. బ్రోకర్ వ్యవస్థకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతోనే మోదీ ప్రయత్నించారని.. రాబోయే రోజుల్లో రైతు చట్టాలపై అవగాహన కల్గుతుందని.. అప్పుడు రైతులే చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తారని రాజాసింగ్ అన్నారు.