పాక్‌ బరితెగింపులు.. భారత జాలర్లపై కాల్పులు.. ఒకరి మృతి.. మరికొందరు…

పాక్‌ మరోసారి బరితెగింపు చర్యలకు పాల్పడింది. నిత్యం సరిహద్దుల్లో ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు పాల్పడే విషయం తెలిసిందే. అయితే ఈ సారి పాక్‌ నేవీ కాల్పులకు పాల్పడింది. గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో ఫిషింగ్‌ బోట్‌లో చేపల వేటకు వెళ్లిన జాలర్లపై పాకిస్తాన్‌ మెరైన్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో ఒక మత్స్యకారుడు మరణించగా.. మరో వ్యక్తి గాయాలపాలయ్యారు. కాల్పుల్లో మరణించిన మత్స్యకారుడిని మహారాష్ట్రకు చెందిన శ్రీధర్‌గా గుర్తించారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు 12 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లుగుర్తించారు. ఘటనపై పోర్‌బందర్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

అక్టోబర్‌ 25న దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా వైపు భారత్‌కు చెందిన ఫిషింగ్‌ బోట్‌ జాలర్లతో బయల్దేరిందని.. నవంబర్‌ 6వ తేదీన కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాగా, పాక్‌ పోలీసులు పద్మ అనే ఫిషింగ్‌ బోటును అపహరించుకుపోయినట్లు సమాచారం. అయితే అదే బోటు వెంట ఉన్నవెరావల్‌ అనే మరో బోటు.. మృతి చెందిన జాలరితో పాటు గాయపడ్డ వ్యక్తిని తీసుకుని తిరిగి వచ్చింది. ఇదిలావుంటే.. పది రోజుల క్రితమే భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది పాక్‌ మత్స్యకారులను భారత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆరుగురు భారత జాలర్లను పాక్‌ కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *