పాక్‌లో హిందూ బాలుడిపై లైంగిక దాడి.. ఆపై దారుణ హత్య.. భయంగుప్పిట్లో మైనార్టీ హిందువులు..!

పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ఇప్పటి వరకు కేవలం మైనర్ యువతులు, మహిళలే లక్ష్యంగా లైంగిక దాడులు, కిడ్నాప్‌లు, బలవంతపు మతమార్పిడి చేసి వివాహాలు చేసుకోవడం వంటి ఘటనలు చూశాం. అయితే ఇప్పుడు మైనర్ హిందూ అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. లైంగిక దాడి చేయడం.. లేదంటే బలవంతంగా మతం మార్పడం.. ఆపై హత్యలు చేయడం నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతోంది.

తాజాగా సింధ్‌ ప్రావిన్స్‌లో మరో మైనర్ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సింధ్‌ ప్రావిన్స్‌లోని బాబరలోయి పట్టణంలోని ఖైర్‌పూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఓ కుటుంబం శుక్రవారం నాడు గురునానక్‌ జయంతి వేడుకల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో తమ 11 ఏళ్ల బాలుడు కన్పించకపోవడం గమనించలేకపోయారు. రాత్రి అయ్యేసరికి.. బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి సమీప ప్రాంతంలో ఓ ఇంట్లో శవంగా కన్పించాడు. మృతిచెందిన బాలుడి బంధువులు ఓ మీడియా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నాడని.. వయస్సు 11 సంవత్సరాలని తెలిసింది.

అయితే బాబరలోయి పట్టణం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై లైంగికదాడి జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని.. వీరిలో ఒకరు ఇంతకుముందు నేరచరిత్ర కలిగి ఉన్నవారని పోలీసులు తెలిపారు. కాగా, గడిచిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి ఘటన రెండోదని తెలిపారు. వరుస ఘటనలు చూసి అక్కడి మైనార్టీ హిందువుల భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు అమ్మాయిలు మిస్సింగ్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఏ ఒక్క యువతులను కూడా గుర్తించి తీసుకురాలేకపోయారని.. వారందర్నీ అక్కడి ఇస్లామిక్‌ మూకలు బలవంతపు కిడ్నాప్‌లు చేసి మతమార్పిడి చేస్తున్నారని.. అంతటితో ఆగకుండా వారిని బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని హిందూ సంఘాలు చెబుతున్నాయి.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *