“గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారికి అభ్యర్ధిస్తున్నాను” అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులో ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోందని.. ఈ క్రమంలో తక్షణమే విదేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిలిపివేయాలంటూ కోరారు. కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు విధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఇప్పటికే అనేక దేశాలు విమానాల రాకపోకలను నిలిపివేశాయంటూ లేఖలో పేర్కొన్నారు.