కొత్తగూడెంలో లక్ష దీపోత్సవం.. హాజరుకానున్న స్వామి పరిపూర్ణానంద

కార్తీకమాసం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనుంది. లక్ష దీపోత్సవానికి వచ్చే భక్తులందరికీ పూజా సామాగ్రిని నిర్వాహకులే ఉచితంగా అందజేయనున్నారు. 2019లో జరిగిన లక్ష దీపోత్సవానికి దాదాపు 25 వేల మంది వరకు హాజరయ్యారని.. ఈ సారి 50 వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు రంగాకిరణ్ తెలియజేశారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదని.. పాల్గొనే భక్తులు 8390147666 నంబరుకు మిస్‌ కాల్ ఇవ్వాలని నిర్వాహకులు రంగాకిరణ్ గారి సూచించారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *