నీ బిడ్డ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఉద్యోగమిచ్చినవ్…..నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకివ్వవు?-బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర

ఇలాంటి ఫాంహౌజ్ సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదు
బండి సంజయ్ ను అభినందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర
బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసిన సంబిత్ పాత్ర

‘‘నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సి ఉద్యోగమిచ్చినవ్. నీ కొడుకు, అల్లుడుకు మంత్రి పదవులిచ్చినవ్. మరి నిరుద్యోగులేం చేశారు? వారి కెందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు?’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు. సచివాలయానికి రాకుండా ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ లాంటి సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 4వ రోజు చిలుకూరు చౌరస్తా నుండి మొయినాబాద్ వరకు బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసిన నంబిత్ పాత్ర మొయినాబాద్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే…
• దమ్ముంటే పాతబస్తీలో సభ పెట్టాలని నరేంద్ర మోదీకి ఓవైసీ విసిరిన సవాల్ ను బండి సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ కార్యకర్తలు స్వీకరించి భారీ బహిరంగ సభ పెట్టి సత్తా చూపారు. బండి సంజయ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా.
• తెలంగాణ కోసం వందలాది మంది బలిదానం చేసుకుంటే ఆ త్యాగాలు వ్రుథా అయ్యియా. రాష్ట్రంలో ఒకే కుటుంబం పాలన చేస్తోంది.
• 111 జీవో రద్దు ఏమైంది? ఎందుకు రద్దు చేయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా నడుస్తోంది.
• 2014లో మద్యం ద్వారా రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తే…..నేడు ఆ సంఖ్య ఐదారు రెట్లకు పెరిగి రూ.22 వేల కోట్లకు చేరింది. జనాన్ని మందు బానిసలుగా చేసి పాలన చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్న ఓడించాల్సిందే.
• నీళ్లు-నిధులు-నియామకాలనే నినాదంతో అధికారంలోకి వచ్చి వాటిని తుంగలో తొక్కిండు(అని తెలుగులో ప్రసంగించారు).
• సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా జరుపుతానని ప్రకటించి మాట తప్పిన కేసీఆర్ ను గద్దె దించాలి. బీజేపీ అధికారంలోకొస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *