ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు నియమించబడ్డాడు. జాక్ డోర్నీ సీఈవోగ వ్యవహరించేవారు. అయితే ఆయన రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీగా వ్యవహరిస్తున్న పరాగ్ అగర్వాల్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్‌ను తాను కూడా సమర్ధిస్తున్నట్లు జాక్‌డోర్నీ తెలిపారు. జాక్‌డోర్నీ తన అధికారిక ఖాతాలో రాజీనామా అంశాన్ని పోస్ట్ చేశారు. ట్విట్టర్‌తో తనకు ఉన్న 16 ఏళ్ల అనుబంధాన్ని లెటర్‌లో తెలిపారు. కాగా, పరాగ్ అగర్వాల్ కూడా పదేళ్ల నుంచి ట్విట్టర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన సంస్థలో చేరిన సమయంలో సంస్థ మొత్తం ఉద్యోగస్థులు వెయ్యి మంది కూడా లేరని సమాచారం. అప్పటి నుంచి ట్విట్టర్ సంస్థ అంచెలంచలుగా ఎదుగుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రముఖ మెసెంజర్ యాప్‌గా ట్విట్టర్ ఉంది.