బిట్‌కాయిన్ కరెన్సీపై గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేమీ లేదని అన్నారు. అంతేకాదు.. బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన డాటాను ప్రభుత్వం సేకరించడం లేదని స్పష్టతనిచ్చారు. సోమవారం నాడు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు.
బిట్‌కాయిన్ అంటే..
అందరికీ ప్రస్తుతం వస్తున్న అనుమానం ఇంతకు బిట్‌కాయిన్ అంటే ఏంటి అన్నది. ఈ బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ రూపంలో ఉంటుంది. బ్యాంకులు, క్రెడిట్ కార్డులను జారీ చేసే సంస్థలు లేదా ఇతరుల ప్రమేయం లేకుండా వస్తువుల కొనుగోలు,సర్వీస్ సేల్స్, మనీ ట్రాన్సక్షన్స్‌కు ఈ బిట్‌కాయిన్‌ను ఉపయోగించవచ్చు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారికంగా డిజిటల్ కరెన్సీని దేశంలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.