రేవంత్ వ‌చ్చాక కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వ‌చ్చింది- కేసీఆర్ చేసే మోసాల‌కు పురుగుల పడి చ‌స్తాడు- మూడు చింత‌ల‌పల్లి స‌భలో పొన్నాల ల‌క్ష్మ‌య్య‌

మేడ్చ‌ల్ : కేసీఆర్ చేసే పూజ‌లు కూడా ఆయ‌న్ని కూడా కాపాడ‌లేవ‌ని పీసీసీ మాజీ అద్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య ఘాటుగా విమ‌ర్శించారు. కేసీఆర్ ను చ‌రిత్ర కూడా క్ష‌మించ‌ద‌న్నారు. కేసీఆర్ శేష జీవిత‌మంతా జైలులోనే గ‌డుపుతార‌ని అందుకే వ‌రంగ‌ల్లో కొత్త జైల్ నిర్మించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పై మూడు కేసులు ఉన్న విష‌యం 2014 లోనే సీబీఐ చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. ద‌త్త‌త తీసుకున్న మూడు చింత‌ల ప‌ల్లికి ఏం చేశాడో ద‌మ్ముంటే కేసీఆర చెప్ప‌గ‌ల‌డా అని స‌వాల్ విసిరారు. అన్ని గ్రామాల‌ను అన్ని వ‌ర్గాల‌ను అభివృద్ది చేయాలి కానీ కేవ‌లం ఒక్క వ‌ర్గం కు మాత్ర‌మే డ‌బ్బులు ఇస్తా అన‌డం అవివేక‌మ‌ని, ప‌ద‌వులు ప‌థ‌కాల‌న్నీ కేవ‌లం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల వ‌ర‌కు మాత్ర‌మే అని ఇదంతా ఎన్నిక‌ల స్టంట్ అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంటును ద‌త్త‌త తీసుకుంటున్నా అని క‌నీసం ఒక్క స‌మీక్ష కూడా చేయని కేసీఆర్ ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డానికి సిద్దంగా లేర‌న్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ బాగా ప‌నిచేస్తోంద‌ని కితాబునిచ్చారు .

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *