పొలిటికల్ వాయిస్ : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామా పరాకాష్టకు చేరిందని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని పీసీపీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి అన్నారు . గాంధీభవనల్ లో మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీల మధ్య ఎన్నికల వ్యూహకర్త సునీల్ అనుసంధాన కర్తగా ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ఎప్పుడో బయటపెట్టారని , డిల్లీ- గల్లీ ల మధ్య ఒప్పందం సాగుతుందని ధ్వజమెత్తారు . అడిగిన వెంటనే కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇచ్చే ప్రధాని మోడీ ఈ సారి కావాలని తిరస్కరించినట్టు చేశారన్నారు. బండి సంజయ్ సొంత కార్యాలయంలో దీక్ష చేస్తోంటే ఏమీ కొంపలు మునగవని, కానీ సంజయ్ ను అరెస్ట్ చేసి కావాలని రాష్ట్రంలోని సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని రవళిరెడ్డి దుయ్యబట్టారు .
రెండు పార్టీల మధ్య జరుగుతున్న డ్రామాలను ప్రజలకు వివరిస్తామని , కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్న ఆ రెండు పార్టీలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.