మయన్మార్‌ మహిళ.. చైనా భర్తతో.. మణిపూర్‌లో ఉంటూ..

మణిపూర్‌, మయన్మార్‌ సరిహద్దులో నివసిస్తూ డ్రగ్స్‌ దందా స్టార్ట్‌ చేస్తూ పట్టుబడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి దందా కాదు.. ఏకంగా పోలీసులే ఖంగుతినేలా ఉంది వీరి వ్యాపారం. అసోం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు సంయుక్తంగా కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో మయన్మార్‌కు చెందిన ఓ మహిళ అరెస్ట్ అయ్యింది. అయితే ఈమె చైనాకు చెందిన ఓ వ్యక్తిని వివాహమాడి అక్రమంగా మణిపూర్‌లో నివసిస్తున్నారు. మోరే పట్టణంలో ఉంటున్న వీరి వద్ద నుంచి రూ.500కోట్ల విలువగల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 54 కిలోల బ్రౌన్‌ షుగర్‌, 154కిలోల ఐస్‌ మెత్‌ను సీజ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *