బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో ఫేక్ అంటూ అప్పట్లో ఆప్ నేతలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సంబిత్ పాత్ర పోస్ట్ చేసిన వీడియో మార్ఫింగ్ అయిన వీడియో అని ఆప్ నిరూపించింది. దీంతో ఆయనపై తప్పుడు వీడియో షేర్ చేసినందుకు గాను.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో వీడియోను పరిశీలించిన కోర్టు.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.