ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మరైగూడ పోలీస్ స్టేషన్ సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాపం్లో ఓ జవాన్ సహచర జవాన్లపై కాల్పులకు దిగాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో 50వ బెటాలియన్‌కు చెందిన నలుగురు జవాన్లు మరణించగా.. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సహచర జవాన్లపైకి రెచ్చిపోయి ఎందుకు కాల్పులు జరిపారన్నదానికి కారణాలు తెలియరాలేదు.