దేశ ప్రజలకు దీపావళి పండుగ ముంగిట ప్రధాని మోదీ తీపి కబురు తెలియజేశారు. సామాన్యుడికి పెనుభారంగా మారిన పెట్రో ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు ఎక్సైజ్‌డ్యూటీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గిస్తున్నట్లు సమాచారం. పెట్రోల్‌పై రూ. 5/-, డీజిల్‌పై రూ.10/- ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలనుంచి సమాచారం వెలువడినట్లు పలు జాతీయ ఛానెల్స్‌తో పాటు.. న్యూస్ ఏజెన్సీలు కూడా స్పష్టం చేశాయి. దీంతో సమాన్య ప్రజలకు దీపావళి పండుగకు ముందు రోజే తియ్యని కబురును మోదీ సర్కార్ తెలుపడంతో ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో పెట్రో ధరలను జీఎస్టీలోకి తీసుకువస్తే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.