లిక్కర్‌ వద్దు.. ఉద్యోగాలు ముద్దు అంటూ బీజేవైఎం మెరుపు ధర్నా..

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరసనలు, ధర్నాలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తు అధికార పార్టీనే కేంద్రంపై ఓ వైపు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తీరుపై ఆగ్రహంతో నిత్యం నిరసనలు తెలుపుతోంది. ముఖ్యంగా వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ బండి సంజయ్‌ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం నాడు బీజేవైఎం మెరుపు ధర్నా చేపట్టింది. లిక్కర్ వద్దు.. ఉద్యోగాలు ముద్దు అంటూ ఫ్లాకర్డులు ప్రదర్శిస్తూ.. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ నేతృత్వంలో రాష్ట్ర అబ్కారీ భవన్‌ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు నోటీఫికేషన్లు ఇచ్చి.. వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు.. నిరుద్యోగ భృతి చెల్లింపు కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే నిరసన చేపడుతున్న కొందరు నిరసనకారులు గేటు దూకి కార్యాలయం వద్దకు దూసుకెళ్లి బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అక్కడి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కార్యాలయం వైపు దూసుకెళ్తున్న క్రమంలో బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ కార్యదర్శి షెహజాదీతో పాటు.. కార్యవర్గ సభ్యులు సొలంకి శ్రీనివాస్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *