BJP నిరుద్యోగదీక్షలో కన్పించని రఘునందన్, రాజాసింగ్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజరు క్యాడర్‌లో అనుమానాలకు దారితీస్తోంది. ఇటీవల హుజురాబాద్‌ బైపోల్‌లో విజయం సాధించిన ఈటల రాజేందర్‌తో తెలంగాణలో బీజేపీకి మరో ఎమ్మెల్యే సంఖ్య పెరిగింది. రాజాసింగ్‌, రఘునందన్‌ రావుతో పాటుగా ఈటల రాజేందర్‌తో కలిపి బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ సర్కార్‌కు RRR సినిమా చూపిస్తారని క్యాడర్‌ తెగ సంబరపడిపోయింది. కానీ సోమవారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో ఈటల రాజేందర్‌ హాజరైనప్పటికీ.. రాజాసింగ్‌, రఘునందన్‌ రావులు మాత్రం కన్పించలేదు. దీంతో వీరిద్దరు ఎందుకు హాజరుకాలేదు..? నేతల మధ్య ఏమైనా గ్యాప్‌ ఏర్పడిందా..? ఇటీవల ఢిల్లీ టూర్‌ అనంతరం రాష్ట్ర అధికారుల మధ్య ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయా..? అన్న కొత్త అనుమానాలు రేకెత్తాయి. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో ఈ అంశంపై చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో పొలిటికల్‌ వాయిస్‌ ఎమ్మెల్యే రఘునందన్‌ రావును సంప్రదించగా దీక్షలో హాజరుకాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంలో ముందస్తుగా షెడ్యూల్స్‌ ఉన్న నేపథ్యంలోనే దీక్షలో పాల్గొనలేకపోయినట్లు వెల్లడించారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *