బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ..!

2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు పక్కా వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే మినిపోరులా జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో కమలనాథులు మంచి జోష్‌తో ఉన్నారు. ఈ జోష్‌ను కొనసాగించేందుకు భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు పాతబస్తీలోని మహావీర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రజాసమస్యలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. సమావేశాల తొలిరోజు రాష్ట్ర పదాధికారులతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ భేటీకి శాసనసభా పక్షనేత రాజాసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, పొంగులేటి, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్, ప్రధాన కార్యదర్శులు, ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాపూరావు తదితరులు హాజరయ్యారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *