తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలిని 80పైగా మంది సభ్యులతో ఏర్పాటు చేసిన నియామకాన్ని, జీవో నంబర్లు 245 మరియు 569 ద్వారా 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో “ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (WP(PIL).SR.28276/2021) “దాఖలు చేసిన మాజీ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి .
టీటీడీయాక్ట్ లో ఉన్న పరిమితికి మించి,ఇష్టారాజ్యంగా, ధర్మకర్తల మండలి లో సభ్యులను నియమించిన కారణంగా నియామకం చెల్లదని,టిటిడికి ఆర్థికభారం కానుందని, మరియు తిరుమల పవిత్రతకు భంగం కలుగుతుందని, కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తిరుమలలో భక్తి భావాన్ని మరింతగా పెంపొందించి భక్తులకు సౌకర్యాలు కల్పించేట్టుగా ఉండాలి కానీ రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల కొండను మార్చుతున్నారంటూ భాను ప్రకాశ్ రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ ద్వారా ప్రభుత్వం చేస్తోన్న తప్పుడు పనులను ఆపడానికి ప్రయత్నం అన్నారు.