టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్ఆర్‌సీపీ భారీ షాకిచ్చింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఇలా జరగడంతో తెలుగు తమ్ముళ్లు నిరాశలో మునిగిపోగా.. ఇక వైసీపీ శ్రేణులు మాత్రం పండుగ జరుపుకుంటున్నాయి. అటు కుప్పంలో.. ఇటు పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 25 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అందులో 18 స్థానాలు వైసీపీ గెలిచింది. మరో ఆరు స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా.. ఒక స్థానం ఏకగ్రీవమైంది.
ఇక రాష్ట్రంలో జరిగిన మిగతా మున్సిపాలిటీలో కూడా వైసీపీ ప్రభంజనం సృష్టించింది. నెల్లూరు కార్పోరేషన్‌లో అయితే 54కు 54 డివిజన్లు వైసీపీ వశం చేసుకుంది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.