మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కాన్వాయ్ దాడి చేసిన అనంతరం.. బండి సంజయ్‌పై కూడా దాడికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పోలీసులు బండి సంజయ్ కాన్వాయ్‌ను అక్కడి నుంచి ముందుకు దాటించారు. కాగా, బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని బీజేపీ నేతలు ఖండించారు.