భగినీ హస్త భోజన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్‌, విజయశాంతి

మల్కాజ్‌గిరిలోని ఉప్పర్‌గూడాలో జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భగినీ హస్త భోజనం ఏర్పాటు చేశారు. కులాల వారీగా విభజించబడ్డ హిందూ సమాజాన్ని ఏకం చేయాలని వక్తలు ప్రసంగించారు. మతం మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్‌ హోదా రాజ్యంగం ప్రకారం వర్తించదని జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ కన్వీనర్‌ కర్నె శ్రీశైలం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రాజకీయ నాయకులు మతం మారి కూడా దళితులమంటూ.. దళిత సమాజాన్ని మోసగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ నేతలు, మాజీ ఎంపీలు వివేక్‌ వెంకట స్వామీ, విజయ శాంతి కూడా ప్రసంగించారు. దేశంలో దళితులకు సమన్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని.. నరేంద్ర మోదీ కేబినెట్‌లో అనేక మంది దళితులు కేంద్రమంత్రి హోదాలో ఉన్నారని వివేక్‌ అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావాలంటూ కేసీఆర్‌ను గద్దె దించాలంటూ రాములమ్మ ఫైర్‌ అయ్యారు. ఇక ప్రముఖ కవి జొన్న విత్తుల రామలింగేశ్వర రావ్‌ ప్రసంగిస్తూ.. సమాజంలో కులాల మధ్య దూరం తగ్గాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటూ భగినీ హస్త భోజన కార్యక్రమాన్ని కోనియాడారు. అనంతరం బస్తీలోని దళిత మహిళల చేతుల మీదుగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రముఖ సినీ నటి విజయశాంతి , మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావ్ , ప్రముఖ కవి జొన్న విత్తుల రామలింగేశ్వర రావ్ , అప్పాల ప్రసాద్ జీ తదితరులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *