ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జలుబుతో ఉండటంతో.. వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని.. త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.