కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ సోకి ఆస్పత్రిలో ఉన్నవారికి, హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఉద్యోగి కుటుంబ సభ్యులకు కరోనా సోకినా.. వారికి 15 రోజుల సెలవు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. మార్చి 25 తర్వాత కోవిడ్ సోకిన ఉద్యోగులకు ఈ సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.