హైదరాబాద్ : 2012లో నిర్మల్ బహిరంగ సభలో హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోర్టుకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీచేస్తామని న్యాయమూర్తి ఉత్తర్వుల్లిచ్చారు. నిర్మల్ ప్రసంగంపై న్యాయవాది కరుణా సాగర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు పెట్టారు . ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 1న నాంపల్లి ఎంపీ,ఎమ్మెల్యే కోర్టుకు అక్బరుద్దీన్ ఒవైసీ హాజరు కావాలని ఆదేశించింది. లేనిపక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని జడ్జి ఉత్తర్వులు లో పేర్కొన్నది.