పాకిస్తాన్లో హిందూ దేవాలయాలపై నిత్యం దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గతేడాది డిసెంబర్లో జమియాత్ ఉలేమా ఇస్లాం ఫజల్ అనే ముస్లిం సంస్థ చేసిన దాడి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కల్గించింది. కైబర్ పంక్త్వా సమీపంలోని తేరీ ఆలయం అతిపురాతనమైనది. అయితే అక్కడి ఇస్లాంకు చెందిన పలు అల్లరి మూకలు పెద్ద ఎత్తున దాడులకు దిగుతూ..వరుసగా ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో తేరీ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఘటనపై పాక్ సీజేఐ గుల్జార్ అహ్మద్ సీరియస్ అయి.. ఆలయాన్ని పునరుద్దరించాలంటూ తీర్పు వెలువరించారు. అంతేకాదు.. ఆలయాన్ని ధ్వంసం చేసిన అల్లరిమూకల నుంచి రూ.33 మిలియన్లను (పాక్ కరెన్సీ రూపాయి) రికవరీ చేయాలంటూ ఖైబర్ పంఖ్త్వా ప్రభుత్వాన్ని సీజేఐ ఆదేశించారు.
ఈ క్రమంలో ఆలయ పునర్మిణామనంతరం సోమవారం నాడు తేరీ ఆలయంలో దీపావళి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు పాక్ సీజేఐ గుల్జారీ అహ్మద్‌ను రావాలంటూ స్థానిక హిందూ సంఘాలు కోరాయి. దీంతో ఆయన సోమవారం నాడు తేరీ ఆలయంలో దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని పాక్ హిందూ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ తేరీ ఆలయం 1920లో శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ సాధువు జ్ఞాపకార్ధం నిర్మించబడింది.