టీఆర్ఎస్ పంచే డ‌బ్బులు తీసుకున్నా కూడా ప్ర‌జ‌లు బీజేపీని భారీ మెజార్టీతో గెలుస్తుంది- బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు బండి సంజ‌య్

• ఈ రోజు వెల్లడైన సర్వేల ప్రకారం బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నడు. ఈ విషయం తెలిసి సీఎం కేసీఆర్ హైబత్ తిన్నడు. ఓటుకు రూ.20 వేలు పంచుతున్నడు. బీజేపీ ఎక్కడా అడ్డుకోవడం లేదు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ ప్రజలవే. కనీసం పేదలైనా బాగుపడతరు కదా…
• టీఆర్ఎస్ పార్టీ క్యాష్ ను నమ్ముకుంటే….బీజేపీ క్యారెక్టర్, కెపాసిటీని నమ్ముకుంది.
• టీఆర్ఎస్ ఫేక్ లెటర్ స్రుష్టిస్తోంది. నమస్తే తెలంగాణ బూతు పేపర్ లో రాస్తోంది. టిష్యూ కన్నా అధ్వాన్నం. నకల్ కొట్టడానికైనా అకల్ కొట్టాలి. అడ్రస్ హైదరాబాద్ ది పెట్టి…పిన్ కోడ్ నెంబర్ కరీంనగర్ పెట్టిండ్రు.
• తప్పుడు ప్రచారంతో ప్రజలను అయోమయం చేయడానికి టీఆర్ఎస్ కుట్ర. వారి గోతిలో వాళ్లే పడతరు.
• హుజూరాబాద్ ప్రజలారా….వరి కావాలా? ఉరి కావాలా?….వరి కావాలంటే బీజేపీకి ఊరి కావాలంటే…..టీఆర్ఎస్ కు ఓటేయాలి.
• కేసీఆర్ తాలిబన్ లా మారిండు. వరి వేస్తే సీడ్ దుకాణాలను సీజ్ చేస్తామని కలెక్టర్లు బెదిరిస్తున్నరు. సిగ్గుండాలి. ఎవరిచ్చిండ్రు మీకు అధికారం? బరితెగించి మాట్లాడతారా?
• సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా పట్టించుకోడట….ఈయనో పోటుగాడు.
• ఎఫ్ సీఐ కొనడం లేదని ఖమ్మం కలెక్టర్ అబద్దాలు చెబుతున్నడు. కేసీఆర్ కాళ్లు మొక్కితే…ఏదైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నరు.
• వీళ్లపై చట్ట, న్యాయపరంగా పోరాడతాం.
• నువ్వెవరు వరి గురించి మాట్లాడటానికి కేసీఆర్….వరి ధాన్యం మొత్తం కొనేది కేంద్రమే. నువ్వు బ్రోకర్ వి మాత్రమే.
• రైతులను బెదిరిస్తే….నీ సంగతేందో చూస్తాం….గల్లా పట్టి కొనిస్తాం. ఈ విషయంలో మేం జైలుకు పోయేందుకు మేం సిద్ధం…
• కేంద్రం- రాష్ట్రం మధ్య ధాన్యం కొనుగోలు విషయంలో ఒప్పందం కుదిరిన మాట వాస్తవం కాదా? (ఇదిగో ఒప్పంద పత్రం..) పోయినసారి యాసంగిలో 95 లక్షల మెట్రిక్ టన్నులు, వానాకాంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పంట మొత్తం కొన్నది కేంద్రమే. ఈసారి కూడా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీఎం స్పష్టం చేయాలి.
• ఎంఎస్ పీ కేంద్రమే ఇస్తోంది. లేబర్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, కమీషన్ సొసైటీకి ఇస్తోంది. కస్టమ్ మిల్లింగ్ ఛార్జీలు, స్టోరేజీ ఛార్జీలు, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు, ధాన్యం నిల్వ చేసినందుకు డబ్బులిస్తోంది. గన్నీ బ్యాగులకు డబ్బులిస్తోంది. చివరకు సుతిలి తాడు డబ్బులు కూడా కేంద్రమే ఇస్తోంది. ఇవిగాక కేసీఆర్ కు 2 శాతం కమీషన్ ఇస్తోంది. మరి నువ్వు చేసేదేముంది? ఎందుకు ధాన్యం కొనబోమని బెదిరిస్తున్నవ్. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం నీకు లేఖ రాసిందా?
• కేసీఆర్ చెంప చెళ్లుమన్పించాలంటే…హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఇంకోసారి సీఎం రైతుల గురించి మాట్లాడాలంటే హుజూరాబాద్ ప్రజలే గుర్తుకురావాలి.
• సీఎంకు సోయి లేదు….ఏం మాట్లాడుతుందో అర్ధం కావడం లేదు.
• కేసీఆర్ తాలిబన్ రాజ్యం రావాలనుకుంటున్నరు. బీజేపీ రామరాజ్యం కోసం పోరాడుతోంది.
• రైతులారా….సీఎం మాటలు పట్టించుకోకండి. వరి పంట వేయండి. మొత్తం ధాన్యాన్ని కొనిపించే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది.
• దళిత బంధుపై సీఎం, టీఆర్ఎస్ నాయకులు బరితెగించి అబద్దాలు చెబుతున్నరు. దళిత బంధును ఆపాలని ఎవరూ లేఖ రాయలేదని సుమోటాగా ఆపేశామని ఎన్నికల సంఘం హైకోర్టులో స్పష్టంగా వాదనలు విన్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దళిత బంధును ఎవరూ ఆపలేదని చెప్పింది. అయినా దళితబంధును ఆపిందెవరో దళిత సమాజమంతా గుర్తించింది.
• ఈటల రాజేందర్ చంద్రబాబును కలిసిండ్రని విషపు రాతలు రాస్తున్నరు. మేం కూడా చెప్పగలం….కేసీఆర్ దారుస్సలాంలో తాలిబన్లతో చర్చలు జరిపిందని మేం కూడా అనొచ్చు. కానీ టీఆర్ఎస్ లెక్క మేం సంస్కారం హీనులం కాదు.
• దళిత బంధు విషయంలో టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది. తాను తీసిన గోతిలో తానే పడింది.
• ప్లీనరీలో క్రికెట్ కామెంటరరీ హర్షాభోగ్లే మాదిరిగా సోది చెప్పి కేసీఆర్ వెళ్లిపోయిండు. మధ్యాహ్నం తరువాత ప్లీనరీ నుండి ఆ పార్టీ నాయకులంతా వెళ్లిపోవడంతో ఖాళీ అయ్యింది.
• ఎన్నికల సంఘం సభ పెట్టకుండా ఆపిందంటూ కేసీఆర్ అబద్దాలు చెబుతుండు. హుజూరాబాద్ వచ్చి ముఖం చూపే దమ్ములేక ఈసీపై నిందలేస్తున్నవ్.
• వరి వేస్తే ఉరే గతి అని బెదిరించినందుకు రైతులు,..ఉద్యోగాలు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వలేదని నిరుద్యోగులు…..డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని మహిళలలు….దళిత బంధు ఎందుకు ఆపినవని దళితులు కేసీఆర్ ను అడుగడుగునా గల్లా పట్టి నిలదీస్తరనే భయంతోనే హుజూరాబాద్ రాకుండా తోకముడిచినవ్….
• పెట్రోలు, గ్యాస్ ధరల పెంపుపై…..దేశంలో, రాష్ట్రంలో మహిళల్లో ఏ ఒక్కరూ పొయ్యి పెట్టొద్దని…గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాం. తెలంగాణలో 10 లక్షలకుపైగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత నరేంద్రమోదీదే..
• పెట్రోలు ద్వారా ఒక్కో లీటర్ కు వ్యాట్ ద్వారా రూ.26లకుపైగా…కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా రూ.14లకుపైగా పైసలొస్తున్నయ్. మొత్తం లీటర్ పెట్రోలుకు రూ.41లను కేసీఆర్ దొబ్బిపోతున్నడు. కేంద్రంపై నిందలేస్తున్నడు సిగ్గులేకుండా…
• నేను పోలింగ్ అధికారులకు అప్పీల్ చేస్తున్నా… మీకు ప్రమోషన్లు లేవు….జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు….మీ గురించి కేసీఆర్ ఏనాడూ ఆలోచించలేదు. అనేక ఇబ్బందులు పెట్టిండు…నిజాయితీగా వ్యవహరించండి. కేసీఆర్ సంగతేందో చూడండి…
• బీజేపీని టీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తుంటే పోలింగ్ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నరు.
• హుజూరాబాద్ ప్రజలారా….విజ్ఝతతో వ్యవహరించండి. బీజేపీకి ఓటేయండి….
• మీ ఓటుతో గడీలను బద్దలు కొడతాం. కుటుంబ పాలనను, నియంత పాలనను తరిమితరిమి కొడతాం. … మాపోరాటానికి అండగా ఉండాలని కోరుతున్నాం.
• మేనిఫెస్టోపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై……ఆయనే ఒక జోకర్. అగ్గిపెట్టే మంత్రి

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *