టిటిడి పాలకమండలి సభ్యుల నియామకాన్ని ఏపి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ని హైకోర్టు సస్పెండ్ చేసింది. సాధారణ ధర్మకర్తల మండలి నియామకం తో పాటు ప్రత్యేక ఆహ్వానితులను కూడా జగన్ ప్రభుత్వం నియమించింది. హిందూ సంఘాలు దీనిపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించాయి. టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఈ విషయంలో ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.