దుబ్బాక : హుజూరాబాద్ లోనే కాదు మా దుబ్బాకలో కూడా దళితబంధును అమలు చేయండి అంటూ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో దుబ్బాకలో దీక్ష చేశారు. దుబ్బాకలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి వెంటనే దళిత బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఒత్తిడి చేస్తూనే ఉంటామని వేలాది మంది కార్యకర్తలు ప్రజలతో కలిసి దుబ్బాక పట్టణంలో నిరసన దీక్ష చేపట్టారు.
నిరసన దీక్షలో జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అద్యక్షుడు కొప్పు భాష, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నిమోజకవర్గ నాయకులు బాలేష్ గౌడ్, ఎస్ఎన్ చారి, కృష్ణ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.