తిరుపతి : తిరుపతి లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ ర్యాలీ భారీగా సాగింది. క్యాబినెట్ మంత్రి హోదా వచ్చిన తర్వాత ఆయన తొలిసారిగా తిరుపతి వచ్చారు. క్యాబినేట్ మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఉండటం తో కొత్త మంత్రులందరూ సమావేశాల తర్వాత ఒక్కొక్కరు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల లో జన ఆశీర్వాద్ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్రంలో మోడీ సర్కారు నిర్ణయాల వల్ల కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా దేశం సమర్థవంతంగా ఎదుర్కొన్నదని, వెంటనే వ్యాక్సిన్ తెచ్చుకోగలిగామని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో దళిత, గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీ అన్నారు. సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతోన్న కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత మోడీ సర్కారుకు దక్కుతుందన్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాశ్ రెడ్డి, రమేశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు