చండీఘడ్ : ఒలంపిక్స్ లో భారతదేశానికి బంగారు పతరం తెచ్చిన నీరజ్ చోప్రా దేశానికే గర్వకారణం అని హర్యాణ గవర్నర్ దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఇక్కడి రాజ్ భవన్ లో గవర్నర్ ను నీరజ్ చోప్రా మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ నీరజ్ చోప్రాను అభినందించి, ఘనంగా సన్మానించారు . నీరజ్ చోప్రాకు బాగా ఇష్టమైన దేశీయ నెయ్యితే చేసిన చుర్మాను తినిపించారు. భవిష్యత్ లో నీరజ్ చోప్రా భారతదేశం పేరును మరింత ఇనుమడింప చేస్తాడని, దేశానికి ఎనలేని కీర్తిప్రతిష్టలు తీసుకువస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు .
వచ్చే ఏషియన్ క్రీడలకు , కామన్వెల్త్ క్రీడలకు కూడా క్రీడాకారులు ఇప్పటినుంచే గట్టిగా కష్టపడాలని దత్తాత్రేయ సూచించారు . ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముందు చూపుతో హర్యాణ క్రీడాకారులు మరింత రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు .