మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య
సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్. బాబూ జగ్జీవన్ రామ్ గారు అని మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కొనియాడారు. మంగళవారం నాడు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని నందిగామ గాంధీ సెంటర్ లో ఆయన విగ్రహానికి స్థానిక తెదేపా నేతలతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు ఆర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దూరదృష్టితో, దీర్ఘకాలిక ప్రణాళికా రచనలతో తిరుగులేని నాయకుడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్. స్వతంత్ర భారతావని తొలి దళిత ఉప ప్రధాని. స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. భారత పార్లమెంటులో 40ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించిన దళిత నాయకుడు. అంటరానితనం నిర్మూలించడానికి కృషి చేసిన వారిలో ప్రముఖుడని పేర్కొన్నారు. దళితుల సామాజిక రాజకీయ హక్కుల కొరకు ధైర్యంగా వాధించిన వ్యక్తి. బాబూజి చిన్నతనం నుంచే కులవివక్షను రూపుమాపేందుకు కృషి చేసారని గుర్తు చేశారు https://youtu.be/dPSmemuzghQ