దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. 13వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు అప్రమత్తంగగా ఉండాలని సూచించింది. 33 రోజుల తర్వాత 13వేల మార్క్‌ను దాటిందని.. గడిచిన నాలుగైదు రోజుల నుంచి నిత్యం 10వేలకు పైగా కేసులు నమోదవ్వడం.. అదేసమయంలో రికవరీలు తగ్గడం డేంజర్ బెల్స్‌ను మోగిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం.. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ మరణాలు కూడా సంభవిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని.. రెండు డోసులు తీసుకున్నప్పటికీ మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని సూచిస్తోంది.
కాగా, బూస్టర్ డోసును కూడా ఇచ్చేందుకు మోదీ సర్కార్ రెడీ అవ్వడంతో ఒమిక్రాన్‌కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు నిపుణులు. జనవరి 10వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడ్డ వారితో పాటుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. అంతేకాదు త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే వారిని కూడా ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.