అక్రమంగా పనుల్లో బంగ్లాదేశీయులు.. 40 మంది అరెస్ట్..

దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దేశ సరిహద్దు గుండా అక్రమంగా చొరబడి దక్షిణాదివైపు వచ్చేసి గుట్టుచప్పుడు కాకుండా పలువురు అక్రమార్కుల ద్వారా ఫేక్‌ ఐడీకార్డులను పొందుతూ పనుల్లో చేరిపోతున్నారు. ఇలా మహారాష్ట్రలోని భీవండి ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది బంగ్లాదేశీయులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. భీవండి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీయల్‌ కంపెనీల్లో బంగ్లాదేశ్‌కు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద సరైన ధృవపత్రాలు లేవని పేర్కొన్నారు. వారి నుంచి ఫేక్‌ ఆధార్‌ కార్డులు, పాన్‌కార్డులు. రూ.94వేల విలువగల 28 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్క భీవండి ప్రాంతంలోనే మూడు పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఫేక్‌ చిరునామాలతో నివసిస్తున్నారని విచారణలో తేలింది. ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారన్నదానిపై విచారణ కొనసాగుతోంది. కాగా, సదరు బంగ్లాదేశీయులు ముంబై, గుజరాత్‌, భీవండి అడ్రస్‌లతో ఫేక్‌ పత్రాలను సృష్టించి.. చలామణి అవుతున్నారని.. వీరికి కొందరు అక్రమార్కులు కూడా సహకరిస్తున్నారని తేలింది. వీరు వారి బంధువులతో, సరిహద్దులు దాటించిన వ్యక్తితో ఐఎంపీవో యాప్‌ ద్వారా సంభాషణలు జరుపుతున్నారని గుర్తించారు. వీరందరిపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *