ఆస్తివిలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలి
ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్
అమలాపురం : ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడనాడాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సంక్షేమ సంఘం అమలాపురం కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది,
స్థానిక ఎంప్లాయిస్ ఫోన్ నందు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి పౌర సంక్షేమ సంఘం నాయకురాలు టీ నాగ వరలక్ష్మి అధ్యక్షత వహించింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచే ఆలోచన కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్196 197 198 జీవోలను తక్షణం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు
రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు కదిలించాలని పట్టణంలో అన్ని వార్డు లోనూ అభ్యంతరం పత్రాలు వార్డు సచివాలయాలలో అందించాలని నిర్ణయించడం జరిగింది ఈకార్యక్రమంలో పౌరసంక్షేమ సంఘం నాయకులు బిఎన్ వెంకటేశ్వర్లు బి రామకృష్ణ టి విశ్వ ప్రసాద్ ఏం సూరి చంద్రా పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జంగా రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు