ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. శుక్రవారం నాడు సాయంత్రం రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర పోరు చోటుచేసుకుంది. ఈ క్రమంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మృతిచెందిన మావోయిస్టు మిలీషియా కమాండర్ అని పేరు మద్వీ భీమా అని గుర్తించారు. ఘటన స్థలంలో పెద్ద ఎత్తున మందు గుండి సామాగ్రిని గుర్తించారు. ఒక రైఫిల్, ఓ ఐఈడీ వైరింగ్, ఐదు కిలోల ఐఈడీ, 20 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 2 బీజీఎల్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.