పొలిటికల్ వాయిస్, రంగారెడ్డి: రెండో సారి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైన శంబిపూర్ రాజును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ జ్వాల మాసపత్రిక ఎడిటర్ ,పటేల్స్ మీడియా ఎండి కుల్లా విజయ్ కుమార్, తెరాస వ్యవస్థాపక సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ నాయకుడు చింత స్వామి . పార్టీ పుట్టిన నుంచి ఉన్న నాయకుడిగా రాజును గుర్తించి రెండో సారి ఎమ్మెల్సీ ఇవ్వడం, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పై వారు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ స్వగృహం లో కలిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. మర్యాద పూర్వకంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుతో భేటీ అయ్యి రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆకాంక్షించారు.