దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మావోలకు భారీ షాక్ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోని గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటోల అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని గడ్చిరోలీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అంకిత్ గోయల్ తెలిపారు. గాయపడ్డ జవాన్లను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని.. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలు లభించాయని.. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.