యూపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో ఉన్నాయన్న సమయంలో సమాజ్ వాదీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రధాన అనుచరుడు పీయూష్ జైన్ ఇంట్లో భారీగా నగదు కట్టలు దొరికిన సంగతి తెలిసిందే. అయితే ఐటీ అధికారులు మొత్తం వివరాలు వెల్లడించడంతో.. నగదుతో పాటుగా నగలు, గంధపు చెక్కలు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు దొరికిన మొత్తం నగదు రూ.194.45 కోట్ల రూపాయలని వెల్లడించారు. అంతేకాదు ఏకంగా 23 కిలోల బంగారం, 600 కిలోల గంధపు చెక్కలను అధికారులు రికవరీ చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, రికవరీ చేసుకున్న గంధపు చెక్కలు మార్కెట్‌లో దాదాపు రూ.6 కోట్ల విలువ ఉంటుందన్నారు. కాగా, కాన్పూర్ కోర్టు పీయూష్ జైన్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది.