హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు , కరీంనగర్ ఎంపీ పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని మున్నూరుకాపు సంఘాల నాయకులు హెచ్చరించారు. మున్నూరుకాపు- బీసీ నాయకుడు కాబట్టే అహంకారంతో హనుమంతరావు దుర్భాషలాడారని, మైనంపల్లి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు అన్నారు. మున్నూరుకాపుల జోలికొస్తే మైనంపల్లిని రాజకీయ సమాధి చేస్తామని , రాష్ట్రంలోని మున్నూరుకాపులు, బీసీలు సంజయ్ కు మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. ఇక నుంచైనా బుద్ది మార్చుకోవాలని హితవుపలికారు .
సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాంలో వారు మాట్లాడారు . ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్, ఎడ్ల రవి పటేల్, బండి సంజీవ్ పటేల్, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సుంకరి బాలకిషన్ రావు పటేల్, సభ్యులు మీసాల చెంద్రయ్య పటేల్, రాష్ట్ర నాయకులు మంగళరాపు లక్ష్మణ్ పటేల్, సామల వేణు పటేల్, బత్తుల సాయిబాబు పటేల్, సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.