హైదరాబాద్, ఏప్రిల్ 11,2025: వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కిన చిత్రం వృషభ. వి.కె. మూవీస్ పతాకంపై ఉమాశంకర్ రెడ్డి నిర్మించి, అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వం వహించారు. యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో జీవన్, అలేఖ్య జంటగా నటించగా, కృష్ణ, శ్రీలేఖ ముఖ్య పాత్రలు పోషించారు. 1960ల నుంచి ప్రారంభమై 1990ల కైలాసగిరి వరకు సాగిన కథ, నాటకీయత, భావోద్వేగాలకు మేళవింపుగా రూపొందింది.

కథా నేపథ్యం
1960లో పశువులపై వ్యాప్తిచేసిన మర్మమైన వ్యాధి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. శాస్త్రవేత్తలు దానికి పరిష్కారం కనుగొనలేక విఫలమవుతుంటే, సుశ్రుతానందన్ అనే శాస్త్రవేత్త హిమాలయాలకు బయలుదేరి అఘోరుడు రుద్రకేశ దిగంబర స్వామిని కలుస్తాడు. ఆయన సూచనలతో కైలాసగిరికి ప్రయాణించి పరిష్కారం వెతుకుతాడు.
ఈ నేపథ్యంలో 1990 నాటికి కథ బసవుడు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను జీవితం పట్ల విరక్తి చెంది, అక్రమంగా మద్యం తయారీకి పాల్పడుతుంటాడు. అలివేలు అనే యువతిని ప్రేమిస్తాడు. ఊహించని మలుపులతో కథ సాగుతుంది. చివరికి బసవుడు తన కుటుంబ చరిత్రలో దాగిన నిజాలను తెలుసుకుని మార్పు దిశగా సాగుతాడు.
నటీనటుల ప్రదర్శన
జీవన్, అలేఖ్య తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. కృష్ణ, శ్రీలేఖ సహా మిగతా నటీనటులంతా తాము చేసిన పాత్రలకు న్యాయం చేశారు. జబర్దస్త్ గెడ్డం నవీన్, ఫిమా, రియాజ్, బాబీ తదితరులు మంచి సహాయ పాత్రలు పోషించారు. మాధవి బాటనా బలమైన పాత్రతో మెప్పించింది.
సాంకేతిక విభాగం
ఛాయాగ్రాహకుడు యుఎస్ విజయ్ విజువల్స్‌ను అద్భుతంగా చూపించారు. ఎడిటర్ మహేంద్రనాథ్ కట్స్ క్షణం గడిచేలా మోయించకుండా కుదించారు. ఎం.ఎల్. రాజా అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బలాన్ని చేకూర్చింది. రామాంజనేయులు రాసిన పాటల లిరిక్స్ ఆకట్టుకున్నాయి.

దర్శకత్వం
దర్శకుడు అశ్విన్ కామరాజ్ టేకింగ్, స్క్రీన్‌ప్లే పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. కథలో గ్రిప్ ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో 16 నిమిషాల ఘట్టం థియేటర్లలో ప్రేక్షకులను మైమరపించేలా ఉంది. నందీశ్వరుడి కాన్సెప్ట్ ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది.

విభిన్నమైన కథ, శ్రద్ధ వహించిన దర్శకత్వం, బలమైన సంగీతం, ఆకట్టుకునే నటనతో వృషభ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సందేశాత్మకమైన ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అని చెప్పొచ్చు. రేటింగ్: 3/5