ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సభ ప్రారంభంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని అంశాలపై చర్చిద్దామని వ్యాఖ్యానించినప్పటికీ.. మధ్యలో వ్యవసాయంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రధానపక్షం వైసీపీతో వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు రన్నింగ్ కామెంట్స్ చేసుకుంటూ విమర్శలకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పలు కామెంట్స్‌కు చంద్రబాబు ఆవేదన చెంది ఏకంగా సభను వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఆయన వెంటనే మిగతా సభ్యులంతా కూడా వెళ్లిపోయారు.
అసలు జరిగిన విషయం ఏంటంటే..
సభలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలపై స్సందించిన చంద్రబాబు.. ఇన్నాళ్లూ ఎన్నో అవమానాలు పడ్డానని.. నా కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. నా భార్యను కూడా అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. నా కుటుంబ సభ్యులను రోడ్డుపైకి లాగారని.. ఎన్నో అవమానాలను భరించాను.. కానీ ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కొనలేదని తీవ్ర భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు సభనుంచి చంద్రబాబు బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంటే మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చేశారు.