న్యూఢిల్లీ : దేశ ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఇళ్లు, విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్, గ్యాస్, రోడ్ల వంటి కనీసం అవసరాల కోసం దేశ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూడటం కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పేద మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చే ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రధాని మోడీ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు . ఈ విడత ఉజ్వల పథకం వలస కూలీలకు మరింతగా ఉపయోగపడనుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు .
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని మహోబాలో ఈ పథకం ప్రారంభం అయ్యింది. బుందేల్ ఖండ్ ముద్దుబిడ్డ , గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గడ్డనుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వంటింట్లో సమస్యలు త్వరగా తీరితీనే మహిళా సోదరులు దేశ నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా పనిచేస్తారన్నారు . మహిళా శక్తి సంఘటన ద్వారా దేశ పురోభివృద్దికి బాటలు వేయవచ్చన్నారు మోడీ.