హైదరాబాద్ : రాజీనామా చేసి కేసీఆర్ తో ఢీ కొడుతోన్న ఈటెల రాజేందర్ కు మరో బూస్టప్ లాంటి మద్దతు దొరికింది. టీఆర్ఎస్ ఎంపీగా పనిచేసి బయటికొచ్చి కాంగ్రెస్ లో చేరినా తర్వాత అక్కడనుంచీ బయటకు వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఈటెల రాజేందర్ కు వోటేయాలంటూ హుజూరాబాద్ ప్రజలకు లేఖలు రాశారు.
తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు మీ దిక్కు చూస్తున్నది , తెలంగాణ ఉద్యమానికి మూల స్థంబాలుగా ఉన్న మీరు ఇచ్చే తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని ఆయన లేఖలో విజ్ఙప్తి చేశారు. నేను, ఈటెల రాజేందర్ లాంటి వారందరం కూడా తెలంగాణ కోసం , తెలంగాణ ప్రజల బాగు కోసం మాత్రమే ఆయన వెంట ఉన్నాము కానీ అభివృద్ది విషయంలో కేసీఆర్ పచ్చిగా మోసం చేశాడని లేఖలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఘాటుగా విమర్శించారు. చేవెళ్లలో జీవో 111 తో పాటు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకంలో అయితే తట్టెడు మట్టి తవ్వలేదని అన్నారు.
హుజూరాబాద్ ప్రజలకు నిత్యం అండగా ఉండే ఈటెల రాజెందర్ ను గెలిపించి తెలంగాణ రాజకీయాలకు ఆశాకిరణం లాగా నిలవాలని పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ కి మరింత బలం చేకూరినట్టయ్యింది.
