వడ్ల కోనుగోళ్లపై సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం నాడు హనుమకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టిందని.. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఇటు వడ్లను కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. రైతుల సమస్యలను పట్టిచుంకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమస్య వచ్చినప్పుడల్లా.. కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తూ.. నిరాధారమైన ఆరోపణలు చేయడం కేసీఆర్‌కు అలవాటని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్‌ను ఎత్తేసిన సీఎం.. ఎలా ధర్నాలు చేయించారని నిలదీశారు. ఇక హుజురాబాద్ ఎన్నికల్లో ధర్మాన్ని నిలబెట్టడంలో మీడియా చాలా గొప్పగా పనిచేసిందని కొనియాడారు.