బంగ్లా హిందువులపై దాడులను ఖండిస్తూ పోస్టు చేయడమే పాపమా..? ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్లాక్‌ చేయడం దేనికి సంకేతం..?

ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై ఇస్లామిక్‌ ఉగ్రవాద అల్లరి మూకలు దాడులు చేసిన విషయం తెలిసిందే. దసరా, శరన్నవరాత్రి వేడుకల నేపథ్యంలో బంగ్లాలోని ఇస్లామిక్‌ అల్లరి మూకలు.. అమ్మవారి మండపాలను తగలబెడుతూ.. విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతేకాదు.. పలు ఆలయాలపై కూడా దాడులు చేసి.. అందులో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసి.. అక్కడి హిందువులను భయబ్రాంతులకు గురిచేశారు. ఇస్లాంలోకి మతం మారాలంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం.. లేదంటే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగడం నిత్యకృత్యంగా మారింది. దసరా సందర్భంగా బంగ్లాలో నెలకొన్న అల్లర్లలో దాదాపు పదుల సంఖ్యలో హిందువులు మరణించగా.. అనేక మంది తీవ్రగాయాలపాలయ్యారు. మహిళలను, యువతులను అపహరించుకుపోయి.. అత్యాచారాలకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలియడంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషించింది.

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌ బంగ్లాలో హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ పోస్టులు చేశారు. దీంతో ఫేస్‌బుక్‌ ఆమె అకౌంట్‌ను వారం రోజుల పాటు నిషేధించింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పోస్ట్ చేసి తెలిపారు. నిజాల్ని బహిర్గంతం చేస్తే నిషేధిస్తారా..? అంటూ ఫేస్‌బుక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *